Draft rebuild preview. Not the live tama.org.
TAMA emblemఅట్లాంటా తెలుగు సంఘం

Activities

Manabadi

Mana Badi Telugu language program.

Manabadi

అట్లాంటా తెలుగు సంఘం 'తామా' 41 సంవత్సరాల ప్రస్థానంలో మనబడి ఒక కలికితురాయి. సుమారు 20 సంవత్సరాల క్రితం మన ముందు తరాల పిల్లలకి తెలుగు నేర్పాలనే ఒక ఉన్నత ఆశయంతో ఒక బేస్మెంట్లో మొదలై, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ చివరికి 2012 లో సిలికానాంధ్ర మనబడితో కలసి అప్పటి తామా విద్యాకార్యదర్శి విజయ్ రావిళ్ల ఆధ్వర్యంలో సరికొత్త రూపుదిద్దుకుంది. 2 తరగతులలో 34 మందితో తామా ఆఫీసులో సరికొత్తరూపుదిద్దుకున్న మనబడి, ప్రస్తుత 2019 విద్యా సంవత్సరంలో తామా అధ్యక్షులు వెంకీ గద్దె మరియు చైర్మన్ వినయ్ మద్దినేని సారధ్యంలో 500 మందికి పైగా విద్యార్థులతో కమ్మింగ్, ఆల్ఫారెటా, డన్వుడి, నార్క్రాస్, మేకన్ మరియు రివర్డేల్ నగరాల్లో టియర్ 1 లెవెల్లో దిగ్విజయంగా నడుస్తుంది. మన అట్లాంటా ప్రజల కోరిక మేరకు, ఈ సంవత్సరం రివర్డేల్ లోని హిందూ టెంపుల్ లో 2 తరగతులతో ఇంకో కొత్త ప్రదేశం ప్రారంభించామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము. ప్రతి శనివారం మూడు గంటలనుండి 5 గంటల వరకు తరగతులతోపాటు, మౌఖికం మరియు లిఖితం లాంటి త్రైమాసిక, సంవత్సరీక పరీక్షలు జరుగుతున్నాయి. మనబడి విజయంలో గురువులు, సమన్వయకర్తలు, తామా విద్యాకార్యదర్శుల మరియు భాషాసైనికుల పాత్ర మరువలేనిది.

Click here to Register for Manabadi
2022-23 Classes start September 10th

Manabadi Telugu Manabadi English